సమయం, స్పందన, లక్షంపై త్రివిధ దళాలకే అధికారం ఉగ్రవాదులను పెంచి పోషించే వాళ్లను పాతాళంలోకి తొక్కేస్తాం
పహల్గాంపై కీలక భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్, ఎన్‌ఎస్‌ఎ, సిడిఎస్, త్రివిధ దళాల
చీఫ్‌లు హాజరు నేడూ వరుస భేటీలు సిసిఎస్‌తోపాటు మోడీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ
న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడికి స్పందనపై సాయుధ దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వెల్లడించారు. స్పందించే తీరు, లక్షాలు, సమయం వారే నిర్ణయించుకుంటారని ప్ర ధాని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఉగ్రవాదం అంతు చూడాలన్నది దేశం దృఢసంకల్పం అ ని మోడీ ఉద్ఘాటించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజి త్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాయుధ దళాల సామర్థంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ప్రధాని మోడీ తెలియజేశారు. ‘దేశ స్పందన విధాన్ని, లక్ష్యాలను, సమయాన్ని నిర్ణయించుకునే సంపూర్ణ స్వేచ్ఛ సైన్యానికి ఉంది’ అని మోడీ చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకార చర్యలకు మార్గాల గురించి ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ సమావే శం చోటు చేసుకుంది.
దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను, వారి ప్రోత్సాహకులను ‘భూమి చివరి వరకు’వెంటాడతామని, ‘వారు ఊహించలేనంతగా’ కఠినంగా శిక్షిస్తామని మోడీ శపథం చేశారు. మరో వైపు బుధ వా రం నాడు కీలక భేటీలు జరగనున్నాయి. వీటిలో సిసిఎస్‌తోపాటు ప్ర ధాని మోడీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ స మావేశం కానుంది. వీటిల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న ట్లు తెలుస్తోంది. సిసిఎస్‌లో ఐదుగురు సభ్యులతోపాటు రవాణా, ఆరో గ్య, వ్యవసాయ, రైల్వే మంత్రులు ఉన్నారు. ఈ కీలక భేటీలు జరిగే ఒక రోజు ముందు ప్రధాని మోడీ త్రివిధ దళాదుపతులతో సమావేశం కావ డం ప్రాధాన్యత సంతరించుకుంది. కశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశం పహల్గాంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులను ఉగ్రవాదులు ఈ నెల 22న కాల్చిచంపిన విషయం విదితమే, ఆ ప్రాంతంలో సుదీర్ఘ కాలంలో పౌరులపై ఆ పైశాచిక దాడి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలను రగిల్చింది.
దాడి కారకులపైన, వారి ప్రోత్సాహకులపైన ప్రతీకార చర్యల కోసం డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ కరాఖండి ప్రకటనలు, జాతీయ భద్రతపై ఏమాత్రం వెనుకాడేది లేదన్న ప్రభుత్వ దృఢచిత్తం భారత్ నుంచి అత్యంత కఠిన ప్రతీకార చర్య ఉంటుందనే ఆశలు కలిగించాయి. గతంలో 2016లో ఉరిలో జవాన్తుపై ఉగ్ర దాడి తరువాత పాకిస్తాన్ లోపల లక్షిత దాడులను, పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది హత్యల తరువాత బాలాకోట్‌లో వైమానిక దాడిని మోడీ ప్రభుత్వం నిర్వహించింది. పహల్గాంలో ఉగ్ర దాడి దరిమిలా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ లక్షంగా తీవ్ర చర్యలు తీసుకున్నది. వాటిలో భాగంగా పాక్‌తో సింధు జలాల ఒప్పందం అమలును ప్రభుత్వం నిలిపివేసింది.
హోమ్ శాఖ కార్యదర్శి అధ్యక్షతన భేటీ
కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ మంగళవారం ఉన్నత స్థాయి భద్రత సమావేశానికి సారథ్యం వహించారని, మూడు పారామిలిటరీ దళాల అధిపతులు, మరి రెండు భద్రత సంస్థల సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారని అధికార వర్గాలు తెలియజేశాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులతో సహా 26 మందిని బలిగొన్న ఉగ్ర దాడి నేపథ్యంలో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాల నడుమ ఈ సమావేశం జరిగింది. సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ (డిజి) దల్జీత్ సింగ్ చౌదరి, జాతీయ భద్రత గార్డ్ (ఎన్‌ఎస్‌జి) డిజి బ్రిఘు శ్రీనివాసన్, అస్సాం రైఫిల్స్ డిజి లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా సమావేశానికి హాజరైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) అదనపు డిజి అనుపమా నీలేకర్ చంద్ర కూడా సమావేశానికి హాజరైనవారిలో ఉన్నారు. అయితే, సమావేశంలో ఏమి చర్చించారో వెంటనే తెలియరాలేదు.