Sunday, May 18, 2025

నీరజ్ చోప్రాకు ప్రధాని మోడీ అభినందనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్‌త్రో హీరో నీరజ్ చోప్రాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ చోప్రా 90.23 మీటర్ల దూరంలో బల్లెను విసిరి చరిత్ర సృష్టించాడు. నీరజ్ తన కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత ప్రధాన మంత్రి మోడీ కూడా నీరజ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. నీరజ్‌లాంటి అథ్లెట్ దొరకడం భారత్ అదృష్టమన్నారు. కెరీర్‌లోనే అత్యంత అరుదైన మైలురాయిని అందుకున్న నీరజ్‌కు అభినందనలు అంటూ ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అద్భుతమైన ఫీట్, దోహా డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ ఫీట్‌ను సాధించినందుకు అభినందనలు. ఇది అతని అవిశ్రాం, అంకితభావం, క్రమశిక్షణ, కఠోర శ్రమకు దక్కిన ఫలితమని ప్రధాని కొనియాడారు. ఈ ప్రదర్శనతో దేశం గర్విస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News