న్యూఢిల్లీ : ట్రంప్ ద్వారా అమెరికా శుక్రవారం నుంచి విధిస్తున్న పాతిక శాతం సుంకాల ప్రభావం భారత్‌కు చెందిన పలు రంగాల ఉత్పత్తులపై వెంటనే పడుతుంది. ప్రత్యేకించి భారతదేశపు అత్యధిక ఎగుమతుల రంగ సంబంధిత ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, స్టీల్, స్మా ర్ట్‌ఫోన్లు, అల్యూమినియం, సోలార్ పరికరాలు, మెరైన్ ఉత్పత్తులు, వజ్రాలు, నగలు నిర్ణీత ప్యాకెట్ ఫుడ్స్, వ్యవసాయ ఉత్పత్తులపై పడుతుంది. ఇవన్నీ కూడా ఈ పాతిక శాతం జాబితాలో చేరుతాయి. భార త్ అమెరికా మధ్య ఇప్పుడు 87 బిలియన్ డాలర్ల ఎగుమతి లావాదేవీలు సాగుతున్నాయి. అమెరికానే భారత్‌కు అత్యధిక స్థాయి ఎగుమ తి దేశం అయింది. ఇక వివిధ రకాల మందుల ఉత్పత్తి ఫార్మా కంపెనీలపై కూడా పాతిక శాతం భారం పడుతుంది. ట్రంప్ నిర్ణయంతో తక్షణరీతిలో సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నత ః ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ వ్యవస్థాపక డైరెక్టర్ రాహుల్ అహ్లూవాలియా స్పందించారు. 25 శాతం సుంకాలతో తమపై ఎక్కువగా ప్రభావం పడుతుందని టాటా మోటార్స్, భారత్ ఫోర్జ్ కంపెనీ వర్గాలు విశ్లేషించాయి.
ట్రంప్ అబద్ధాలపై మోడీ పెదవి విప్పరేం? : రాహుల్
అమెరికా అధ్యక్షులు ట్రంప్ అబద్ధాలు చెపుతున్నాడని ప్రధాని మోడీ ఎందుకు ధైర్యంగా చెప్పడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. భారత్ పాక్ ఘర్షణపై ట్రంప్ నగ్నసత్యాలు చెప్పేందుకు సి ద్ధం అయితే, ఏకంగా 30 సార్లు ఇదే నిజమని చెపితే , అది నిజం కా దని చెప్పేందుకు ప్రధానికి ధైర్యం లేదా అని రాహుల్ నిలదీశారు. ప్ర స్తుత ట్రంప్ మోడీ సయ్యాటలో మోడీ ఏదో చెప్పలేని స్థితిలో బలహీన స్థితిలో పడ్డారని , ఏదో రహస్యం దాస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడుల సంబంధిత చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇప్పుడు ట్రంప్ పదేపదే చెపుతున్న దానిని బట్టి చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ఓ సర్పం మాదిరిగా మన ప్రధానిని చుట్టేసుకుని అడపాదడపా చెవిలో కరకు స్వరం విన్పిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ అబద్ధం చెపుతున్నాడని సభలో చెప్పే ధైర్యం మోడీకి లేకుండా ఉంది. చివరికి దేశంపై భారీ సుంకాలు పడ్డా పర్వాలేదంటున్నారన్నారు.