భారతీయ రైల్వేలో అత్యంత కీలక ఘట్టంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ఆరంభోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియతో వర్చువల్‌గా 103 అమృత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. ఇప్పటివరకూ దేశంలోని వివిధ ప్రాంతాలలో , మారుమూల చోట్ల కూడా ఉన్న రైల్వే స్టేషన్లకు అధునాతన హంగులు , ఇతరత్రా ప్రయాణికుల సౌలభ్య ఏర్పాట్లు తరువాత ఇప్పుడు వీటి ఆవిష్కరణోత్సవం జరిగింది. తెలంగాణకు సంబంధించి బేగంపేట, వరంగల్, కరీంనగర్ , ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లురుపేట ఈ అమృత రైల్వే స్టేషన్ల శ్రేణిలో చేరాయి దేశం అన్ని రంగాలలోనూ అధునాతనం కావాలనేదే ప్రభుత్వ ధృఢసంకల్పం. ప్రయాణికులకు సరైన ప్రయాణ ఏర్పాట్లు , పలు స్థాయిల్లో సౌకర్యాలు కీలకం అని ఆయన వెల్లడించారు. దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునీకరించడం జరుగుతోంది.
సరైన వేగం సముచిత ప్రగతి అన్ని రంగాలకు వర్తిస్తుందని తెలిపారు. బికనేర్ నుంచి ఆయన అమృత్ భారత్ రైల్వే సేష్టన్లను ప్రారంభించారు.దేశంలోని 18 రాష్ట్రాలు , యుటిల మొత్తం 86 జిల్లాలను విస్తరించుకుని రూ 1,100 కోట్లకు పైగా వ్యయ అంచనాలతో ఈ స్టేషన్ల ఏర్పాటు జరిగింది. భారతీయ రైల్వే అతి సుదీర్ఘ దూరం ఉన్న రైల్వే లేన్. ఇక అధునాతన సౌకర్యాల్లోనూ ఏ రైల్వేకు తీసిపోకుండా ఉంటుందని ప్రకటించారు. వందేభారత్ సర్వీసుల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ట్రైన్లు ఇప్పుడు దేశంలోని దాదాపు 70 మార్గాలలో ప్రయాణాలలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా రైళ్లు విస్తరించుకున్నాయి. ఇప్పుడు ఇవి అత్యంత అధునాతన రైల్వే స్టేషన్ల దశలతో మరింత సౌకర్యవంతం అవుతాయని ప్రధాని చెప్పారు.