ఐజ్వాల్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మిజోరంలో తొలి రైల్వే లైన్లను ఇతర ప్రాజెక్టులను ఆరంభించారు. ఈ పనుల విలువ రూ 9000 కోట్ల వరకూ ఉంటుంది. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవం జరిపారు. దేశంలోని ఇతర రైల్వేలైన్ మార్గాలతో ఈ ఈశాన్య ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అనుసంధానం చేసేందుకు ఈ పనులు కీలకం అయ్యాయి. బైరాబి సారంగ్ రైల్వే లైన్ పనులు కూడా ప్రధాని ఆరంభించిన వాటిలో ఉన్నాయి. దేశ ప్రధాని అయిన తరువాత మిజోరంకు రావడం ప్రధాని మోడీకి ఇది రెండోసారి. ఐజ్వాల్-ఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రారంభోత్సవం జరిపారు.
ఈ రాష్ట్రంలో రైల్వే, హై వేలు, ఇంధన, క్రీడా వసతుల ఏర్పాట్ల కీలక ప్రాజెక్టులను కూడా ఆరంభించారు. మిజోరం, మణిపూర్, అసోం, తరువాత ఫశ్చిమ బెంగాల్, బీహార్‌లలో మొత్తం మీద మూడు రోజుల పర్యటనకు ప్రధాని మోడీ బయలుదేరారు. మిజోరంలో ప్రధాని కార్యక్రమాలకు రాష్ట్ర గవర్నర్ వికె సింగ్, ముఖ్యమంత్రి లాల్‌దూమ్‌హోమా, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంట ఉన్నారు.