Saturday, September 6, 2025

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. జపాన్, చైనా దేశాల పర్యటన ముగించుకుని విచ్చేసిన ప్రధాని మోడీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. చైనా తియాన్‌జిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వరకు జరిగిన షాంఘై సహకార సంస్థ 25 వ వార్షిక సమావేశాలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో షాంఘై సహకార సంస్థ అభివృద్ధి వ్యూహం, గ్లోబల్ గవర్నెన్స్‌లో సంస్కరణలు, ఉగ్రవాద నిరోధక చర్యలు, శాంతి, భద్రత , ఆర్థిక రంగాల్లో సహకారం, సుస్థిర అభివృద్ధిపై ఫలప్రదమైన చర్చలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News