Thursday, May 8, 2025

ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతితో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టి ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన ఖచ్చితమైన దాడుల గురించి తాజా సమాచారం అందించడానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. “ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు” అని Xలో పోస్ట్‌ చేస్తూ.. ప్రధాని, రాష్ట్రపతి సమావేశమైన ఫోటోలను పంచుకుంది.

కాగా, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM) ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు సహా తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ దాడులు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత ఆర్మీ మిస్సైల్స్ తో బుధవారం తెల్లవారుజామున ఉగ్రస్తావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News