- Advertisement -
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తమిళనాడులోని ప్రఖ్యాత భగవాన్ బృహదేశ్వరాలయం సందర్శించారు. అక్కడ పూజాదికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆచార వ్యవహారాల ప్రకారం వేదిక, శివైక తిరుమురయ్ మంత్రోఛ్ఛారణల నడుమ ఆయన పవిత కలశం జలంతో అభిషేకం నిర్వహించారు. పవిత్ర గంగా జలాలను ఇందుకోసం తెప్పించారు. ప్రధాని మోడీకి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో , దేవాలయ ఆచార వ్యవహారాల తీరుతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ధోవతి పైన దవళ అంగీ, అంగవస్త్రం తో ముందు ప్రదక్షిణలు చేసి తరువాత దేవాలయ గర్భగుడి లోనికి చేరారు. చోళ రాజుల నాటి ఈ దేవాలయానికి యునెస్కో వారసత్వ కట్టడ ఖ్యాతి దక్కింది. ప్రధాని మోడీ తమిళనాడులో రెండు రోజుల పర్యటనకు వచ్చారు.
- Advertisement -