- Advertisement -
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. జిఎస్టీ సంస్కరణలపై ప్రధాని మాట్లాడుతూ.. దీపావళికి ముందే ప్రజలకు పండగ వచ్చిందన్నారు. జిఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని.. నిత్యావసరాల ధరలు తగ్గుతాయని శుభవార్తా చెప్పారు. దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి తదుపరి తరం సంస్కరణలు అవసరమన్నారు. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. కొత్త సంస్కరణల వల్ల ఆత్మనిర్భర భారత్ మరింత ముందే సాకారం అవుతుందని తెలిపారు. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని ప్రధాని విమర్శించారు. యూపిఎ హయాంలోనే అధిక పన్నులు విధించారని.. మధ్య తరగతికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని మోడీ మండిపడ్డారు.
- Advertisement -