సింధు జలాలు ఇప్పటి వరకు దేశం దాటి వెళ్లేవి
ఇకపై భారతీయుల ప్రయోజనాలు, పురోభివృద్ధి కోసమే
అవి మన భూభాగంలో పారుతాయి ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : “సింధునదీ జలాలు ఇదివరకు దేశం దాటి వెళ్లేవి. ఇప్పుడు బయటకు వెళ్లకుండా దేశ ప్రయోజనాలకే వినియోగమవుతాయి” అని ప్రధాని మో డీ మంగళవారం స్పష్టం చేశారు. ఎబిపి న్యూస్ ఈవెంట్‌లో పాల్గొన్న మోడీ పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మీడియాలో ఈ మధ్య జలాలపై జోరుగా చర్చ సా గుతోందని, గతంలో భారతీయ హక్కులు విదేశాల్లో ఉప్పొంగేవని, కానీ ఇక ముందు భారతీయ భూభాగంలో పారే జలాలు ఇక్కడి ప్రజల ప్రయోజనం కో సం, వారి పురోగభివృద్ధి కోసమే మన భూభాగంపైనే ఉప్పొంగి ప్రవహిస్తాయ ని అన్నారు. దశాబ్దాల నాటి సింధుజలాల ఒప్పందం రద్దు అయిన తరువాత బహిరంగంగా దానిపై మోడీ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి.
తమ ప్రభుత్వం గత పదేళ్లలో దేశ ప్రయోజనాల కోసం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుందని, కా నీ గత ప్రభుత్వాలు ఈ విధంగా దృఢమై న నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేశాయని వ్యాఖ్యానించారు. ఏదైనా ము ఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్ర పంచం ఏం ఆలోచిస్తోందో అని ప్రజలు యోచిస్తుంటారని పేర్కొన్నారు. గత ప్ర భుత్వాలు నిర్ణయం తీసుకునే ముందు తాము ఓట్లు పొందగలుగుతామా లేదా తమ పదవి పదిలమా లేదా అని ఆలోచించేవని అందువల్లనే ముఖ్యమైన సం స్కరణలు ఆలస్యమయ్యేవని విమర్శించారు. ఈ విధంగా ఏదేశం ముందుకు వెళ్లలేదని ప్రధాని పేర్కొన్నారు.