Friday, May 23, 2025

నా నరాల్లో ప్రవహిస్తున్నది సిందూరం

- Advertisement -
- Advertisement -

బికనూర్ ( రాజస్థాన్) : టెర్రరిజాన్ని ప్రోత్సహించినా, ఉగ్రవాదులకు అండగా నిలిచినా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడిని ఖండిస్తూ, భారత సైనిక దళాలు అతి త్వరలోనే ప్రతీకారం చేశాయ ని అంటూ ఆయన త్రివిధదళాలను ప్రశంసించా రు. గురువారం బికనీర్ లో ఒక ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరిక చేశా రు.మోడీ ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పటికీ, దే శం విషయానికి వస్తే తన రక్తం ఉద్వేగం తో, దృఢ సంకల్పంతో మరిగి పోతుందని, తన న రాల్లో రక్తం కాకుండా వేడి సింధూరం ప్రవహిస్తుందని ఆయన ఉద్వేగంతో అన్నారు. అది తన లోతైన నిబద్ధత, శక్తికి ప్రతీక అని స్పష్టం చేశారు. భారతదేశంపై ప్రత్యక్షయుద్ధంలో ఎన్నడూ గెలవలేని పాకిస్తాన్ కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ టెర్రరి జం ద్వారా దెబ్బతీయాలని యత్నిస్తోందని ఆయ న విమర్శించారు.

దశాబ్దాలుగా ఈ కుట్రలు సాగిస్తోందన్నారు. దేశం కన్నా మరేదీ ముఖ్యంకాదని, రాజస్థాన్ చరిత్ర దీనినే మనకు చూపిందని ప్రధా ని అన్నారు. ఏప్రిల్ 22న పహల్గాం లో టెర్రరిస్ట్‌లు అమాయక ప్రజలపై దాడి చేసి, వారి మ తాన్ని అడిగి మరీ హత్యాకాండకు పాల్పడ్డారని, మహిళల నొసటి సిందూర్ ను తుడిచి వేశారని, ఆనాడు టెర్రరిస్ట్ లు కాల్చిన తూటాలు 140 కోట్ల భారతీయుల హృదయాలను గాయపరచాయని మోడీ అన్నారు. భారతీయ మహిళల సిందూర్ ను తుడిచిన వారిని భారత సైనికులు వాళ్ల మట్టిలోనే పాతి పెట్టారు.టెర్రరిస్ట్ లు చిందించిన ప్రతి రక్తం బొట్టుకూ మూల్యం చెల్లించుకున్నారని ప్రదాని గుర్తుచేశారు. అణుబాంబు బూచి బెదిరింపులకు భారత్ భయపడదని, భారత దృఢ సంకల్పం చెక్కుచెదరబోదని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఒక విషయం మరచిపోయింది. ఇప్పుడు భరతమాత సేవకుడు మోడీ ఇక్కడ అత్యంత ధైర్యంగా నిలిచి ఉన్నాడు. దేశ భద్రత కోసం ఎంత కఠోర నిర్ణయాన్ని అయినా తీసుకుంటాడని మోదీ స్పష్టం చేశారు.

జాతీయ భద్రత విషయంలో తమ ప్రభుత్వం దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు ఉగ్రవాదాన్ని అణచి వేసే విషయంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, త్రివిధ దళాల చక్రవ్యూహం ముందు పాకిస్తాన్ తలవంచక తప్పలేదని ప్రధాని గుర్తు చేశారు. కేవలం 22 నిముషాల్లో టెర్రరిస్ట్ శిబిరాలు, అడ్డాలు ధ్వంసమై పోయాయి. భారతదేశం పాక్ కలలో కూడా ఊహించని రీతిలో పగతీర్చుకుందని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా శతృదేశానికి భవిష్యత్ లో భారతదేశం పై కన్నెత్తి చూసినా వినాశనం తప్పదన్న సందేశాన్ని ఇచ్చామని ప్రధాని మోడీ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News