Tuesday, August 26, 2025

సుంకాలు సంకటమే

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: అమెరికా నుంచి భారత్‌పై 50 శాతం సుంకాల విధింపు ఆందోళనకరమే, మనపై ఆర్థిక ఒ త్తిడి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు. అయితే భయపడేది లేదు, మనం ఈ పరిస్థితిని ధైర్యంగానే భరించి ఎదుర్కొంటామని ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌లో చెప్పారు. రెండు మూడు రోజులలో భారత్‌పై అమెరికా భారీ సుంకాల అమలు దశలో ఆయన తొలిసారిగా ట్రంప్ టారీఫ్‌ల పై స్పందించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు మనం శక్తిని పుంజుకోవల్సి ఉందని చెప్పారు. ఇందుకు ఉ న్న పలు మార్గాలను , మనం నమ్మాల్సిన స్వదేశీ, ఆ త్మనిర్భరతలను మరింతగా పెంచుకోవల్సి ఉందని ప్రధాని చెప్పారు. మన కాళ్ల మీద మనం నిలబడే ఆత్మస్థయిర్యానికి ఈ గుజరాత్ నేల ఎంతో ప్రేరణ ఇచ్చిందని చెప్పిన మోడీ ఈ సందర్భంగా భగవానుడు శ్రీకృష్రుడిని, మహాత్మా గాంధీని ప్రధానంగా ప్రస్తావించారు.

అక్కడి నుంచి ఒత్తిడి నిజమే అయితే ఈ క్రమంలో మనం రాజీపడే ప్రసక్తే లేదని , మన రై తులు , చిన్న పరిశ్రమల వారు, పాడి రైతుల ప్రయోజనాల విషయంలో వెనుకంజ వేసేది లేదని స్పష్టం చే శారు. సాధ్యమైనంత త్వరలో పరిష్కారం కనుగోనడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గుజరాత్‌లో ప లు బహుళస్థాయి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి వ చ్చిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఈ నెల 29 నుంచి ట్రంప్ వేసిన 50 శాతం సుంకాల అమలుకు రంగం సిద్ధం అయింది. ఇప్పుడు తలేత్తే విపరీత సుం కాల పరిస్థితిని మనం భరించాల్సి ఉంటుంది. గట్టెక్కే మార్గాలను అలవర్చుకోవల్సి ఉంటుంది. స్వదేశీ ని నాదం మరింతగా ఇనుమడించాలి. అత్యధిక స్థాయి లో ఇక్కడి ఉత్పత్తుల  వాడకానికి దిగాలి.

భారత్ నిర్మిత సరుకులనే కొందాం అనే మంత్రంతో ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని పిలుపు నిచ్చారు. ఇకనైనా వ్యాపారులు తమ దుకాణసముదాయాల ముందు తాము కేవలం స్వదేశీ సరుకులనే విక్రయిస్తామనే పెద్ద బోర్డులను పెట్టాల్సి ఉందని చెప్పారు. తనకు లక్షలాది మంది జనం ఆశీస్సులు, ప్రేమ ఆదరణలు ఉన్నాయని, ఇంతకంటే కావల్సిన దేమిటని ప్రశ్నించారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా అహ్మదాబాద్‌లో సాయంత్రం పెద్ద ఎత్తున రోడ్‌షో సాగింది. దీనిపై ప్రధాని స్పందించారు. కలిసికట్టుగా ఉంటే ఎటువంటి ఒత్తిళ్లను అయినా భరించడమే కాదు , ఎదుర్కొని నిలిచే శక్తిని కల్పించుకోవల్సి ఉందని ప్రధాని చెప్పారు. ఈ సభలో ఆయన కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 60 , 65 ఏండ్లు ఈ దేశానికి పాలన సాగించిన పార్టీ మన దేశం ఇతరులపై ఆధారపడేలా చేసింది. మనకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా చేసింది. దిగుమతుల స్కామ్‌లకు దిగింది. స్వదేశీ నినాదాన్ని పక్కకు పెట్టింది ఈ దుష్పలితాలను మనం ఇప్పుడు ఈ విధంగా అనేక రకాల ఒత్తిళ్ల మధ్య భరించాల్సి వస్తోందని ప్రధాని చెప్పారు. తనకు రైతులు, చిన్నవ్యాపారులు, పశుసంరక్షణ వృత్తిలో ఉన్న వారు ఇతర వర్గాల మేలు కీలకం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News