Monday, August 25, 2025

ఎంత ఒత్తిడి వచ్చినా… తట్టుకునే శక్తిని పెంచుకుంటూనే ఉంటాం: మోడీ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి పరోక్షంగా స్పందించారు. ‘ఎంత ఒత్తిడి వచ్చినా.. రైతులకు హాని జరగనివ్వం’ అని చెప్పారు. సోమవారం అహ్మదాబాద్ లో రూ.5,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఒత్తిడి వచ్చినా.. తమ ప్రభుత్వం తట్టుకునే బలాన్ని పెంచుకుంటూనే ఉంటుందని అన్నారు. చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులు, పశుపోషకులకు ఎటువంటి హాని జరగనివ్వదని అన్నారు. “నేడు ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ అహ్మదాబాద్ గడ్డ మీద నుంచి చెబుతున్నా.. చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులు, పశుపోషకులు.. అందరికీ, నేను మీకు పదే పదే హామీ ఇస్తున్నా. మీ ప్రయోజనాలు మోడీకి అత్యంత ముఖ్యమైనవి. ఎంత ఒత్తిడి వచ్చినా, తట్టుకునే శక్తిని మనం పెంచుకుంటూనే ఉంటాం” అని చెప్పారు.

కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలంటూ డోనాల్డ్ ట్రంప్.. భారత్ పై భారీ సుంకాలు విధించాడు. రెండు సార్లు 25 శాతం చొప్పున మొత్తం 50 శాతం అదనపు సుంకాలను విధించాడు. తాము చెప్పినట్లు వినకపోతే.. భారత్ మరిన్ని సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News