Sunday, April 28, 2024

మహాత్మాగాంధీకి ప్రధాని మోడీ నివాళి

- Advertisement -
- Advertisement -

PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు భారత్ లో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన మార్గం, తెగువను అందరూ స్మరించుకుంటున్నారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌ వద్ద ఘన నివాళులర్పించారు. దేశంలోని యువత మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని ప్రధాని పిలుపునిచ్చారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని ఆయన కొనియాడారు. శుక్రవారం మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి సైతం కావడంతో విజయ్‌ఘాట్‌ వద్ద ఆయనకు ప్రధానితోపాటు లాల్‌బహుదూర్‌ శాస్త్రి కుమారుడు అనిల్‌ శాస్త్రి అంజలి ఘటించారు. దేశంలోని పలువురు ప్రముఖులు, నాయకులు మహాత్మాగాంధీకి, లాల్‌బహుదూర్‌ శాస్త్రికి నివాళులర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News