Friday, September 5, 2025

జిఎస్‌టి 2.0తో దేశాభివృద్ధి రెట్టింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జిఎస్‌టి సంస్కరణలతో దేశాభివృద్ధి అభివృద్ధి వేగంగా దూసుకువెళ్తుందని ప్రధాని మోడీ గురువారం అన్నా రు. దేశం సర్వతోముఖాభివృద్ధికి స్వావలంబనకు ము న్ముందు తీసుకునే సంస్కరణల శ్రేణి ఆగబోదని ప్రధాని అన్నారు.జాతీయఉపాధ్యాయు ల అవార్డు విజేతలతో సంభాషిస్తూ ప్రధాని పలు విషయాలను ప్రస్తావించారు. దీపావ ళి. ఛాత్ పండుగకు ముందే జీఎస్టీ సంస్కరణలు అమలు చేస్తామని స్వాతంత్ర దినోత్స వం నాడు ఎర్రకోట వేదికగా ఇచ్చిన మా టను నిలుపుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ లో చేపట్టిన సంస్కరణలు, కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అంటే దసరా ఉత్సవాలు మొదటి రోజునుంచి అమలు లోకి వస్తాయని మోదీ అన్నారు. బీహార్ లో అతి ముఖ్యమైన పండుగల్లో ఛాత్ పండుగ ఒకటి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, దీపావళి, దసరా నవరాత్రులు దేశవ్యాప్తంగా జరిగే పండుగలు. సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గించే విధంగా జిఎస్టీ విధానంలో సంస్కరణలు చేపట్టి కేవలం రెండు స్లాబ్ ల విధానంపై జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న మర్నాడు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సామాన్యులపై అధిక పన్నులు విధించి వారి జీవితాలను దుర్భరం చేశాయని ప్రధాని విమర్శించారు.

వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు, సామాన్యులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఔషధాలపై ఇక ముందు ధరలు తగ్గనున్నాయని ఆయన అన్నారు. జీఎస్టీ సంస్కరణలను దేశ ఆర్థికవ్యవస్థకు పంచరత్న(ఐదు రత్నాలు)గా పోల్చారు. సరళమైన పన్నువ్యవస్థ, పౌరులకు మెరుగైన, నాణ్యమైన జీవనం, దేశంలో వృద్ధికి ప్రోత్సాహం, పెట్టుబడులు పెంచడం ద్వారా ఉద్యోగాలను ప్రోత్సహించడం, వ్యాపారాలను సులభతరం చేయడం ద్వారా దేశంలో ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పంచరత్నాలుగా పేర్కొన్నారు. భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపేందుకు తదుపరి తరం సంస్కరణలను చేపట్టడం కీలకమని ప్రధాని తెలిపారు. బుధవారం జీఎస్టి కౌన్సిల్ ఆమోదించిన సంస్కరణల వల్ల సామాన్యులకు అవసరమైన రొట్టెలు, పరాటా నుంచి, కొబ్బరినూనెలు, ఐస్ క్రీమ్ ల నుంచి టీవీల వరకూ వినియోగవస్తువుల ధరలు తగ్గుతాయి. జీవిత, ఆరోగ్య బీమాపై పన్నులు పూర్తిగా తొలగి పోతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News