Wednesday, September 17, 2025

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని గుర్తు చేశారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరికి ఎయిమ్స్ కేటాయించామని ఆయన వెల్లడించారు. ఎన్డీయేలో మేము అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు.

ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని హెచ్చరించారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట రోజున తెలుగు ప్రజలు ఎంతో ఆనందించారని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్‌ రాముడు, కృష్ణుడి పాత్రలతో మెప్పించారని చెప్పించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారని ప్రధాని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News