Friday, August 15, 2025

పంద్రాగస్టు స్పీచ్.. ప్రధాని మోడీ రికార్డ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల రికార్డులలో ప్రధాని మోడీ ఇప్పుడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఘనతను దాటేశారు. ఎర్రకోట నుంచి వరుసగా 12 సార్లు జాతిని ఉద్ధేశించి సందేశం విన్పించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ క్రమం తప్పనిరీతిలో 17 సార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. తరువాతి స్థానంలో ఇప్పుడు మోడీ నిలిచారు. ఇందిరా గాంధీ విరామాల క్రమంలో మొత్తం మీద 16 సార్లు సందేశం వెలువరించిన రికార్డుతో ఉన్నారు. ఇక వరుసగా ఆమె 11 సార్లు మాట్లాడిన రికార్డు ఉంది. ఇది ఇప్పుడు మోడీ ప్రసంగంతో వెనుకకు పోయింది. ఎర్రకోట నుంచి ప్రసంగాల క్రమంలో లాల్ బహద్దూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ రెండు సార్లు, చౌదరి చరణ్‌సింగ్ ఒక్కసారి ఈ సందేశాలు వెలువరించారు. ఇందిరా గాంధీ హత్య తరువాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఐదుసార్లు సందేశం వెలువరించారు పివి నరసింహరావు నాలుగుసార్లు, విపి సింగ్ ఒక్కసారి, వాజ్‌పేయి ఆరుసార్లు, మన్మోహన్ సింగ్ పదిసార్లు ఎర్రకోట నుంచి ప్రధానిగా తమ సందేశాలు వెలువరించారు.

5000 మంది ప్రత్యేక అతిధులు..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు ఈసారి 5 వేల మంది ప్రత్యేక అతిధులు హాజరయ్యారు. వీరంతా సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారు. అంగన్‌వాడీలు, మోడీ పథకం లక్‌పతి దీదీలలో భాగస్వాములైన మహిళలు, కొన్ని గ్రామాల సర్పంచ్‌లు ఈ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. ఆహ్వానితుల వరుసలో పలువరు క్రీడాకారులు, ఈ ఏడు జరిగే ఒలంపిక్స్‌కు ఎంపికైన భారతీయ ఆటగాళ్ల బృందం కూడా ఉంది. ప్రత్యేక తరహా వ్యవసాయ సాగు పద్ధతులు, తేనెటీగల పెంపకాలలో విశిష్టతను సాధించుకున్నవారిని, ఔషధ మొక్కల పెంపకందార్లను ఈ ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. వీరంతా కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తమ ప్రత్యేకతను చాటుకునేందుకు మారుమూల ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఇక దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల విజయవంతం దిశలో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ వస్తున్న పారిశుద్ధ కార్మికులకు కూడా ఈసారి ఈ వేడుకల దశలో గౌరవం ఆపాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News