న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం(ABSS)లో భాగంగా ప్రధాని.. రేపు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 103 పునరాభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 86 జిల్లాల్లో సుమారు రూ.1,100 కోట్ల వ్యయంతో 103 స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం పునరాభివృద్ధి చేసింది.
ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేంద్రం రైల్వే స్టేషన్‌లను పున:నిర్మించింది. రేపు రాజస్థాన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ..పునరాభివృద్ధి చెసిన దేశ్నోక్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. తర్వాత బికనీర్-ముంబై మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. అంతకుముందు దేశ్నోక్‌లోని కర్ణి మాత ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేస్తారు.