Sunday, May 4, 2025

అమరావతి గొప్ప నగరంగా ఆవిర్భవిస్తుంది.. ప్రధాని మోడీ ట్వీట్

- Advertisement -
- Advertisement -

అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ మేరకు శనివారం అమరావతి పునః ప్రారంభంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సిఎం చంద్రబాబుకు అమరావతి, ఎపి ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధత అభినందించదగ్గ విషయమని కొనియాడారు. “నూతన, చారిత్రక అధ్యాయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఎపి అభివృద్ధిపథాన్ని అమరావతి మెరుగుపరుస్తుంది. గొప్ప నగరంగా ఆవిర్భవిస్తుందని విశ్వసిస్తున్నా” అని ప్రధాని ఎక్స్ లో పేర్కొన్నారు. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. సిఎం చంద్రబాబు కూడా నిన్న జరిగిన అమరావతి పునః ప్రారంభ సభపై ట్వీట్ చేశారు.

ప్రజల సహకారంతో, కేంద్రం మద్దతుతో అందరికి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధానిని నిర్మిస్తామని.. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం అమరావతి పునః నిర్మాణ పనులను ప్రధానివ మోడీ ప్రారంభించారు. దాదాపు రూ.58 కోట్లతో పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News