నెత్తిన బోనమెత్తి…అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సునీల్ రావు
పోచమ్మతల్లి దేవాలయంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన సునీల్ రావు
మన తెలంగాణ/కరీంనగర్ అర్బన్: డప్పుచప్పల్లు… శివసత్తుల పూనకాలు… పోతురాజుల వేశాలు…బోనాలెత్తిన మహిళలతో ఆషాడమాసంలో పోచమ్మతల్లి బోనాలు అట్టహాసంగా సాగాయని బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కళ్ళుషాక… కోడి పుంజు యాటలతో మొదటి మొక్కులు అందుకునే పొలిమేర దేవత పోచమ్మతల్లి బోనాల జాతర కరీంనగర్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆషాడమాసంలో ముడోవ ఆదివారం నగరంలోని భగత్ మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో జరిగిన పోచమ్మ తల్లి బోనాల జాతరకు బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెత్తిన బోనమెత్తి…బోనాల ఊరేగింపును ప్రారంభించారు. పెద్ద ఎత్తున మహిళలతో కలిసి మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు బోనమెత్తుకొని ఊరేగింపుతో పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుకు మున్నూరు కాపు సంఘం పెద్దలు గౌరవంగా శాలువాతో సత్కరించారు. పోచమ్మతల్లి భోనాల జాతరకు సౌకర్యాలు కల్పించిన సునీల్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్బంగా బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ భగత్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మతల్లి భోనాల జాతర మహోత్సవం లో పాల్గొనడం అదృష్ఠంగా భావిస్తున్నట్లు తెలిపారు.
పెద్ద ఎత్తున మహిళలు భోనాలు ఎత్తుకొని శివస్తుల పూనకాలతో డప్పు చప్పుల్ల మద్య బోనాల పండగ వైభవంగా జరిగిందని తెలిపారు. పోచమ్మతల్లి, పెద్దమ్మతల్లి, ఎల్లమ్మతల్లి, మైసమ్మతల్లి, మహాకాళి అమ్మవారకి ఇలా బోనాలు, కళ్ళు శాఖ, యాజ పుంజులతో ప్రజలు మొక్కులు చెల్లించుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతి సాప్రధాయం అన్నారు. ప్రతి కుటుంబంలో ఎలాంటి శుభకార్యక్రమం ప్రారంభం చేసిన మొట్ట మొదటి సారిగా పోచమ్మతల్లిని కొలుస్తారని అన్నారు. ఆషాడమాసంలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం సంమృద్దిగా వర్షాలు కురిసి… పంటలు పండి ప్రజలు ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో అమ్మవార్లకు భోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితిగా వస్తుందన్నారు. మున్నూరు కాపు సంఘం పోచమ్మతల్లి దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తానని సునీల్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వెంకన్న, సంఘ ఉపాధ్యక్షులు రవీంధర్, సంఘ నాయకులు తోట వెంకట రాములు, కర్ర సత్తయ్య,అంజనేయులు, స్థానికులు ఉపెందర్, వెంకటరావు, రాజ్ ప్రభాకర్, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.