హైదరాబాద్: ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌పై (Krishna Master) గచ్చిబౌలి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గత నెలలో మైనర్ బాలికతో అసభ్యంగాంగా ప్రవర్తించాడంటూ ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బెంగళూరులోకి తన అన్న నివాసంలో తలదాచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బెంగళూరు వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం కంది జైలుకు తరలించారు.
ఈ మధ్యే కృష్ణకు (Krishna Master) వివాహం జరిగింది. తన భార్యకు సంబంధించిన రూ.9.50 లక్షలతోనే అతను బెంగళూరు వెళ్లాడని తెలుస్తోంది. గతంలో కూడా కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతులను అతను మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.