Monday, July 14, 2025

పోయెట్రీ వితౌట్ ఫియర్

- Advertisement -
- Advertisement -

అస్సామీ భాషలో గత మూడు సంవత్సరాలుగా పూర్తిగా కవిత్వానికి అంకితమైన ఒక పత్రిక వస్తుంది దాని పేరు ‘పోయెట్రీ వితౌట్ ఫియర్’. ప్రతి మూడు నెలలకోసారి అటు అస్సామీ మూల భాషలో కవిత్వాల్ని ఇటు కవితలకు ఆంగ్ల అనువాదాలను ప్రచురిస్తున్న ద్విభాష పత్రిక ఇది.అంతే కాకుండా అస్సామీ కవిత్వ సంపుటాల ను సమీక్షిస్తూ, ఆ భాషా కవులతో ఇంటర్వ్యూలు చేస్తూ, ఇతర భాషా కవితలను తమ మాతృభాషలో అడపాదడపా అనువదిస్తూ వస్తున్న పత్రిక ఇది. ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు ఆనంద్ బొర్ముడై ప్రారంభ సంచికలో ‘ఎ పోయెట్రీ వితౌట్ ఫియర్’ పత్రిక ఎందుకు ప్రచురించవలసి వస్తుందో ఇలా వివరించారు.

“పాఠకులు రెండు రకాలు. కవిత్వాన్ని మూల భాషలోనే చదివే వాళ్ళు ఒక రకం. ఇంకో రకం పాఠకులు కవిత్వాన్ని అనువాదాల్లో చదువుతారు. ఈ అనువాద పాఠకులు మొదటి రకం చదువరుల కన్నా, కొంత భిన్నమైన వాళ్లు. మూల భాషలో రాసిన కవుల్ని అర్థం చేసుకోవడం సుల భం. కొత్తగా గొంతెత్తుతున్న కవిని కూడా అప్పటివరకు పరిచయం లేకున్నా, మూల భాషలో రాసినప్పుడు పాఠకులు అర్థం చేసుకుంటారు. కానీ అనువాదంలో కవితల్ని చదువుతున్నప్పుడు వాటి ని రాసిన కవులు అపరిచితులు. కనుక పాఠకులు ఎంతో శ్రద్ధగా చదవాల్సి వస్తుంది. ముఖ్యంగా కవిత పాఠ్యాన్ని అనువాదకుడు ఎలా అనువదించి నా దాదాపు ఆత్మ అయితే మిగిలే ఉంటుంది కనుక, అస్సామీ కవితలకు చేసిన ఆంగ్ల అనువాదాలను ‘పోయెట్రీ వితౌట్ ఫియర్’లో ఇస్తున్నాం. తద్వారా పాఠకుల సంఖ్య కూడా పెరుగుతుంది మునుపటి కన్నా.

కవిత్వం భయానకం కాదు. దౌర్జన్యపూరితం, క్రూరమైంది కూడా కాదు. అయితే అది పాఠకుల కు అర్థం కానప్పుడు భయాల్ని కలిగిస్తుంది. ఆధునిక కవిత్వం ఒకప్పుడు కఠినంగా, సంక్లిష్టంగా ఉండేది. అలా పాఠకులు తగ్గిపోయారు. పాఠకుల కు కవిత్వం అందనప్పుడు దాని ప్రయోజనం నెరవేరుతుందా? మరి కవులు పాఠకులను ఇలా వదిలించుకోవచ్చునా? కానీ ఈనాటి అస్సామీ కవులు సంఖ్యాపరంగా చాలామంది ఉన్నారు. అయితే వాళ్లలో కొందరే తమ కవిత్వాన్ని పాఠకుల దగ్గరికి తీసుకువెళ్లగలుగుతున్నారు.‘పోయెట్రీ వితౌట్ ఫియర్’ అనే మా మాస పత్రిక మామూలు పాఠకులకు కూడా అర్థమయ్యే కవిత్వాన్ని చేరవేయగల ము అనే భరోసాను కల్పిస్తోంది. ఎందరో అస్సామీ యువకులు ఆయా సన్నివేశాలను గొప్ప కవిత్వ అభినివేశంతో రాస్తున్నారు. పాఠకులు సైతం వారి కవిత్వ కౌశలాన్ని గుర్తిస్తున్నారు. అయితే ఈ కవిత్వాన్ని అనువదిస్తే పురస్కారాలు రావచ్చును.

కవిత్వం మనిషిలో, మనిషి పట్ల నమ్మకాన్ని కలిగిస్తుంది. సంక్షోభంలో మనిషికి స్వాంతననిస్తుంది. అందుకే కవిత్వం పఠన యోగ్యంగా ఉం డాలి. అర్థమయ్యేలా ఉండాలి. ఎప్పుడైతే కవులు ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తారో, అప్పుడు పాఠకులు కవుల్ని అలక్ష్యం చేస్తారు. ప్రజల సమస్యల్ని పట్టించుకోకపోతే జనాలు కూడా కవిత్వాన్ని లెక్కచేయరు. కాగా వచనం కన్నా భిన్నమైంది కవిత్వం. వాస్తవంగా మంచి వచనంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కవిత్వంలో స్పష్టంగా రావు. అలాగే, లోతైన సమస్యలు పరిష్కారాలు కూడా. కానీ అనే క చిక్కు ప్రశ్నల్ని కూడా సరళమైన భాషలో ఆవిష్కరించవచ్చు. సాధారణ ప్రజానీకాన్ని కవిత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. పైగా వారి లో కవిత్వం అంటే అర్థం కాదు అనే భయాన్ని కలిగించవద్దు. ‘ప్రధానంగా అస్సామీ కవిత్వం, ఇతర భాషల కవిత్వం ఇంగ్లీషు అనువాదాలు ఉంటాయి కాబట్టి ఇతర భాషల సాహిత్యాన్ని అర్ధం చేసుకునేందుకు ఈ వెబ్ పత్రిక ‘ఎ పోయెట్రీ వితౌట్ ఫియర్’ చదవడం కవులకు, పాఠకులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
నలిమెల భాస్కర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News