- Advertisement -
అమరావతి: ట్రెంచ్ కట్టర్లు, గ్రాబర్లతో శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టామని ఎపి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. పోలవరం పనులు గాడిలో పెట్టామని అన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. డయాఫ్రం వాల్ 1, 396 మీటర్లకు గానూ 500 మీటర్ల నిర్మాణం పూర్తి చేశామని, 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ (Diaphragm wall) పూర్తయ్యేలా పనులు చేపట్టామని తెలియజేశారు. ఎగువ కాఫర్ డ్యాం బలోపేతం కోసం బట్రస్ డ్యాం నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇప్పటికే బట్రస్ డ్యాం నిర్మాణం 90 శాతం పూర్తి అయ్యిందని, 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి పోలవరం ప్రాజెక్టు తీసుకువస్తామని నిమ్మల పేర్కొన్నారు.
- Advertisement -