Thursday, July 31, 2025

స్టూడెంట్‌తో మహిళ టీచర్ అసభ్య ప్రవర్తన.. అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ముంబై: విద్యాబుద్ధులు నేర్పాల్సిన మహిళ టీచర్.. ఓ విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు అమెను అరెస్ట్ చేశారు. నవీ ముంబై (Mumbai) ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35 ఏళ్ల మహిళ టీచర్ ఓ మైనర్ విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్‌మీడియా అకౌంట్లకు అసభ్యకర సందేశాలు పంపించేది. అంతేకాక.. అతనికి సెమీ న్యూడ్‌గా కాల్స్ చేసేది. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీచర్ ప్రవర్తన తమ కుమారుడి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్‌ని అరెస్ట్ చేశారు. ఈ విద్యార్థితోనేనా.. లేక ఇతర విద్యార్థులతో కూడా ఇలాగే ప్రవర్తించేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నాు. ఆమె ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమె సోషల్‌మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News