- Advertisement -
మన తెలంగాణ/బంట్వారం: పేకాట స్థావరాలపై మెరుపుదాడులు చేసి 7మంది పేకాటరాయుల్ల పైన కేసు నమైదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ విమల తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో పేకాట స్థావరాలపై దాడులు జరిపి జిన్‌గుర్తి నర్సిములు, కురువ శ్రీనివాస్, అల్లపురం నగేష్, జిన్‌గుర్తి కృష్ణ, రైసోద్దిన్, బురుజుకాడి మహేష్, జిన్‌గుర్తి బాలప్ప అనే 7గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విమల తెలిపారు. ఇకపైన కూడా ఎవరైనా ఆడితే వారిపై కఠిన చర్యలుంటాయని అన్నారు.
- Advertisement -