Sunday, May 4, 2025

వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర: కరీంనగర్‌లో నివాసముంటున్న ఒక కానిస్టేబుల్ వడదెబ్బతో మృతి చెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన తంగిల్ల మధుకుమార్ అలియాస్ మధు (41) అనే కానిస్టేబుల్ రామగుండం కమీషనరేట్ గోదావరిఖని హెడ్‌క్వాటర్స్‌లో పిఎస్‌వోగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం విధులు నిర్వహించి ఇంటికి వచ్చి మధ్యాహ్నం తిరిగి వచ్చి కళ్ళు తిరుగుతున్నాయని నీరసంగా ఉందని పడుకున్నారు.

రాత్రి సమయంలో పలుమార్లు వాంతులు చేసుకొని ఉదయం స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళి ఎంత సేపటికి రాకపోయే సరికి అతని కుమారుడు వెళ్లి చూసే సరికి కిందపడి అపస్మారక స్థితిలో పడి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయంపై మృతుడి భార్య తంగెల్ల లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News