Wednesday, April 30, 2025

ప్యారిస్ సిగరేట్లు పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

policemen holding paris cigarettes in hyderabad

హైదరాబాద్: నిషేధిత విదేశీ సిగరేట్లను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 ప్యారిస్ సిగరెట్ల కార్టన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3,00,0000 ఉంటుంది. ఒక వ్యక్తిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం….. నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన నితీష్ నిషేధిత ప్యారిస్ సిగరేట్లను నగరంలోని పాన్‌షాపులు, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో చార్మినార్, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు నితీష్ పరారీలో ఉండగా, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని, సిగరేట్లను చార్మినార్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News