Monday, August 11, 2025

కట్టుతప్పిన క్రమశిక్షణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : క్రమశిక్షణారాహిత్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీపడుతున్నాయి. ఆ పా ర్టీ, ఈ పార్టీ అని ఏమిలేదు అ న్ని పార్టీలలోనూ అదే పరిస్థితి. పార్టీ లక్ష్మణరేఖను దాటి వ్యవహరిస్తున్న నా యకులపై చర్య తీసుకోలేని దుస్థితిలోకి అధిష్ఠానాలు నెట్టివేయబడ్డాయి. ఎవరి మీద ఏ చర్య తీసుకుం టే పార్టీ పరిస్థితి ఏమైపోతుందోనన్న దిగులు పార్టీల అధిష్టానాలను వేధిస్తోంది. ‘ఏ పార్టీలో లేవు విభేదాలు, అందుకు తమ పార్టీ అతీతమేమి కాదు’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవి త తాజాగా చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేకపోలేదు.ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణారాహిత్యం లేకపోవడం అనేది పెద్ద విశేషమేమి కాదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీలో ఒకప్పుడు క్రమశిక్షణారాహిత్యంఅనే మాటకు చోటు ఉం డేది కాదు. అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్ పార్టీ కూడా క్రమశిక్షణారాహిత్యానికి అతీతం ఏ మి కాదన్నట్టుగా మారింది.అలాగే ఒకప్పుడు పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు మారుపేరు గా ఉండే బీజేపీ కూడా రాష్ట్రంలో క్రమశిక్షణారాహిత్యంలో కాంగ్రెస్ పార్టీని మించిపోయిందనే విమర్శలను ఎదుర్కొంటోంది.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణారాహిత్యం అనేది కొత్తేమి కాకపోయినా, రాష్ట్రంలోప్రస్తుతం అధికారంలో ఉండటంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు విపక్షాల ముందు చులకనయ్యే విధంగా వ్యవహరిస్తున్నా, పార్టీ అధిష్ఠానం కానీ, పార్టీ క్రమశిక్ష ణా కమిటీ కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసలు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికే క్రమశిక్షణా లేదని ఆయన ఆ పదవి బా ధ్యతలు స్వీకరించిన రోజుననే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మందలించినట్టు వార్తలు వచ్చాయి. కొల్లాపూర్‌లో ఇటీవల జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు ఒకరు మల్లు రవిని వేదికపైనే అవమానించినా అతని పై చర్యలు తీసుకోలేని దుస్థితిలో ఉన్నారన్న విమర్శలు కాంగ్రెస్‌లో వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోన్న క్రమశిక్షణా కమిటీ ఇక ఎవరిపై చర్య తీసుకోగలదనే సందేహాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ భర్త,మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి బహిరంగ సభలోనే తీవ్రస్థాయిలో రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్థానంలో వచ్చే ఎన్నికలలో తన కూతురు పోటీ చేయబోతుందని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా కట్టగట్టుకొని వచ్చి గాంధీభవన్‌లో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోకపోగా, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలదే తప్పనట్టుగా క్రమశిక్షణా కమిటీ వ్యవహరిస్తోందని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ‘తమ పార్టీలో చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నారు’ అని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించినప్పటికీ కనీసం ఆయన్ను అధిష్ఠానం కానీ, క్రమశిక్షణా సంఘం కానీ మందలించిన దాఖలాలు లేవు. ఇలా ఉండగా ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి ఢిల్లీలో స్పందిస్తూ, రాజగోపాల్‌రెడ్డికి నోటీసు ఇచ్చి వివరణ కోరబోతున్నట్టు మీడియాకు తెలిపారు. కానీ ఆదివారం ఇక్కడ సమావేశమైన క్రమశిక్షణా కమిటీ, రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదంటూ అధికారికంగా ప్రకటన చేశారు.

అతీతం కానీ బీఆర్‌ఎస్
క్రమశిక్షణారాహిత్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ తానేమీ అతీతం కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కనీసం ఆ పార్టీ అధిష్ఠానం కవితకు నోటీసు కూడా ఇవ్వలేకపోయింది. తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశంలో అధికార కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకించగా, తానేమో స్వాగతిస్తున్నట్టు కవిత ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్సీగా ఉండి పార్టీ వైఖరికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన కవితపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల రాజకీయ వర్గాలలోనే కాకుండా బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా చర్చకు దారి తీసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై కవిత తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత క్రమశిక్షణారాహిత్యం పట్ల అదిష్ఠానం ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల భవిష్యత్‌లో ఇలాంటి ఉదంతాలు తలెత్తితే ఏ విధంగా చర్యలు తీసుకోగలదని పార్టీలో పెద్ద దుమారమే రేగుతోంది.

కాంగ్రెస్‌ను మించిపోయిన కమలం
పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు ఒకప్పుడు మారుపేరుగా పేరు తెచ్చుకున్న రాష్ట్ర బీజేపీ కొంతకాలంగా కాంగ్రెస్‌ను మించిపోయిందనే విమర్శలు వెల్ల్లువెతున్నాయి. పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ (కేంద్ర మంత్రి) ఒకరిపై ఒకరూ బాహాటంగా విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలలో ఈటల రాజేందర్ అనుచరులకు ఎవరికీ అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని బండి సంజయ్ పార్టీ వేదికపైనే హెచ్చరించారు. దీనికి స్పందించిన ఈటల రాజేందర్ అదేస్థాయిలో ఆయనొక సైకో అంటూ బండి సంజయ్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. కానీ పార్టీలో ఇద్దరు పెద్దతలకాయలు పార్టీ క్రమశిక్షణాను ఉల్లంఘించి వ్యాఖ్యలు చేసుకున్నా బీజేపీ అధిష్ఠానం కనీసం వీరిని వివరణ కోరిన దాఖలాలు లేవని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అలాగే ఇప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజాసింగ్ ఏకంగా పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావును టార్గెట్ చేస్తూ ప్రతి నిత్యం విమర్శలు గుప్పిస్తోన్నా పార్టీ అధిష్ఠానం స్పందించలేదు.

పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించినప్పటికీ రాజాసింగ్ తమ పార్టీ ఎమ్మెల్యేనో , కాదో అధిష్ఠానం తేల్చలేకపోయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును ఉద్దేశించి, ‘ఆయన ఫైటర్ కాదు&రైటర్’ అని రాజాసింగ్ ఎద్దేవా చేసినా అధిష్ఠానం కానీ, రామచందర్‌రావు కానీ స్పందించలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఇప్పటికీ తాను బీజేపీ ఎమ్మెల్యేనేనని ఇటీవల రాజాసింగ్ ప్రకటించారు. అదే పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, ఇప్పటికీ రాజాసింగ్ తమ ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. రాజాసింగ్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆయనపై సస్పెండ్ అనేది ఏమి ఉండదన్నట్టుగా ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అటకెక్కిన క్రమశిక్షణకు అద్దం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీలో క్రమశిక్షణారాహిత్యం సర్వసాధారణ విష యంగా మారడం, నాయకులు లక్ష్మణరేఖ దాటి వ్యవహరించడం వంటి తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News