Wednesday, April 30, 2025

పేదల కన్నీటిని తుడిచేందుకు భూభారతి: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేదల కన్నీటిని తుడిచేందుకు భూభారతిని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా? అని ప్రశ్నించారు. వెంకటాపూర్‌లో భూభారతి రెవెన్యూ సదస్సును మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడారు. చేసిన తప్పులను గత పాలకులు ఇప్పటికీ ఎందుకు గ్రహించడలేదని నిలదీశారు. ధరణి చట్టంలో సాదాబైనామాల అంశాన్ని ఎత్తేశారని, భూ సమస్యలకు సంబంధించి 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ప్రజల న్యాయమైన సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామని, ఎన్నికల ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామన్నారు. రైతులు, ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకున్నారని పొంగులేటి కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News