ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలని.. దీనిలో మరో మాట లేదుని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులో తప్పు జరిగిందని చెబితే చాలు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని.. దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పండని మంత్రి అన్నారు. గృహనిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను కోరుతున్నానన్నారు.
కాగా, ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయిైస్తున్నారని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు ఇస్తున్నారంటూ రోడ్డెక్కుతున్నారు.