Monday, September 8, 2025

రాజకీయ కక్ష ఉంటే మాపై తీర్చుకోవాలి… రైతులపై కాదు : పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే అని రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది ఉద్దేశం కాదని చెప్పారు. బిజెపితో బిఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవం అని పేర్కొన్నారు. ఎరువుల బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని, క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.

రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగా 4 నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని విమర్శించారు. రామగుండం కర్మాగారం ఉత్పత్తి చేసి ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్రానికి 11 లక్షల టన్నులకు గాను 5.2 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయని తెలియజేశారు. ఎరువుల వైఫల్యం బాధ్యత బిజెపి తీసుకోవాల్సిందేనని రాజకీయ కక్ష ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై తీర్చుకోవాలని సూచించారు. రైతుల సహకారంతో బిజెపికి వ్యతిరేకంగా ఒత్తిడిని తెస్తామని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

Also Read : కుల్గాంలో ఎన్‌కౌంటర్‌… ఉగ్రవాది హతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News