Saturday, August 2, 2025

బలగం సినిమా… కాసర్ల శ్యామ్ కు అభినందనలు: పొన్నం

- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ నిండు స్ఫూర్తిని దేశం దాటి వినిపించిన బలగం చిత్రబృందానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బలగం సినిమాకు ఉత్తమ గీత రచయిత అవార్డు దక్కడంతో మన తెలంగాణ కవి కాసర్ల శ్యామ్ కు శుభాకాంక్షలు చెప్పారు. తన సోషల్ మీడియా ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. తెలంగాణ గ్రామీణ జీవన శైలిని, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఊరు పల్లెటూరు పాటలో శ్యామ్ కలం జాడలు స్పష్టంగా కనిపించాయని ప్రశంసించారు. భీమ్స్ అందించిన సంగీతం, వేణు దర్శకత్వంలో ఆ చిత్రానికి మరింత మన్ననలు దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ అరుదైన గౌరవానికిగాను బలగం చిత్ర యూనిట్‌కు మరొక్క సారి పొన్నం అభినందనలు తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News