స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తున్న పంచాయతీరాజ్ చట్టం 2018
సెక్షన్ 285(ఏ) సవరణ
ఇందుకోసం అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు
స్థానిక సమరంలో బిసిలకు 42శాతం కోటా
విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలకు రిజర్వేషన్ల పెంపు వర్తింపు
పల్లె పోరుకు సిద్ధం.. ఎన్నికల సంఘానికి లేఖ
గవర్నర్ కోటా ఎంఎల్‌సి అభ్యర్థులుగా అజారుద్దీన్, కోదండరాం
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రహదారులకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం
మత్య సహకార సంఘాలకు పర్సనల్ ఇన్‌ఛార్జిల నియామకం
రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
నేడు అసెంబ్లీకి రిజర్వేషన్ బిల్లు
మీడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి, పొన్నం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనుంది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 285(ఏ) సవరణకు కేబినెట్ ఆమో దం తె లిపింది. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తె చ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ త ర్వాత ప్రత్యేక జీఓ తీసుకొచ్చి కులగణన ఆధారం గా తెలంగాణలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అదేవిధంగా విద్య, ఉపాధి, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీఓ తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. సిఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఇటీవల వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై కేబినెట్‌లో చర్చించారు. పంటలు, రోడ్లు ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికసాయం కోరుతూ కేబినెట్ తీర్మా నం చేసింది. గోశాలల పాలసీ విధి, విధానాలపై కేబినెట్‌లో చర్చించడంతో పాటు గోశాలలకు సం బంధించి బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. దీంతోపాటు మత్య సహకా ర సంఘాలకు పర్సనల్ ఇన్‌చార్జీలను నియమించడంతో పాటు నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అమీర్‌అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం
అంతేకాకుండా మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. ఈ సారి అమీర్‌అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున కొత్త అభ్యర్థికి అవకాశం రానుంది.
రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో బిసి రిజర్వేషన్ బిల్లు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో నెల రోజుల్లో జరపాలని కోర్డు ఆదేశించింది. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకూడదని గత ప్రభుత్వం 018 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపింది. ప్రస్తుతం బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ముస్లిం కోటా పేరుతో బిజెపి బిల్లును అడ్డుకుంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది.
స్థానిక ఎన్నికలకు ఈసీ రెడీ
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి అందిన సంకేతాలతో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాల సవరణ, తుది జాబితా ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ జారీ చేశారు.
సెప్టెంబర్ 17వ తేదీకి సుప్రీంకోర్టు విచారణ వాయిదా
ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ గతంలో బిఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ 2024 ఆగస్టులో సుప్రీంకోర్టులో సివిల్ అప్లికేషన్ (సిఏ) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో ప్రొఫెసర్‌గా కోదండరాం, ఆమీర్‌అలీఖాన్ కేసు విషయంలో 2025 ఆగస్టు 13వ తేదీన స్టే విధించింది. 2024 ఆగస్టు 14వ తేదీన తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత జరిగిన పరిణామాలు ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉంటే ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తామని వ్యాఖ్యా నించింది. అయితే, ఏదైనా తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను 2025 సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్లను తెలంగాణ కేబినెట్ సిఫారసు చేయడంతో పాటు ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. అయితే ఈసారి అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొత్త అభ్యర్థికి అవకాశం రానుంది.