Friday, August 22, 2025

ఎరువుల సరఫరా బాధ్యత కేంద్రానిదే.. కొరత లేకుండా చూసే బాధ్యత మాది: పొన్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ ఉమ్మడి కరీంనగర్ బ్యూరోః తెలంగాణ రైతాంగానికి అవసరమైన ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వందే అని, ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మాదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్నాటు చేసిన విలేక రుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎరువులపై మా గ్రామ స్థాయి నాయకత్వానికి అధికారులకు వ్యవసాయ రైతు వేదికల వరకు ఎలా సమన్వయం చేయాలని అప్రమత్తం చేస్తున్నాం అన్నారు. ఎవరు లేకున్న చెప్పులు లైన్‌లో పెట్టీ బధనం చేయాలని చూస్తున్నారు..రాక్షసానందం పొందుతున్నారు. బీజేపీ, బిఆర్‌ఎస్ లు.. కాంగ్రెస్ కు వస్తున్న సానుకూల వాతావరణం దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, విద్యుత్ పై బాధ్యత వహిస్తుందన్నారు. ము కలిసి ఎరువులపై కేంద్ర ప్రభుత్వంను ఒత్తిడి చేయాల్సిందే అన్నారు. ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు, వ్యవ సాయ శాఖ మంత్రి యూరియా కొరతపై కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయాం అన్నారు. ఫసల్ భీమా రైతు భరో, రైతు బీమాపై ప్రజా పాలన ప్రభుత్వం తీసుకున్న విధంగా వేరే వాళ్ళు తీసుకోరు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News