Sunday, July 13, 2025

స్పెషల్ సాంగ్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అమీర్ ఖాన్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ అద్భుతమైన స్పందనతో దూసుకెళ్తోంది. ఈ సాంగ్‌ని తెలుగు, తమిళ్ సహా హిందీలో కూడా విడుదల చేశారు. ఈ సాంగ్ ముఖ్యంగా తమిళ్ లో భారీ వ్యూస్ అందుకుంటే తెలుగులో యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ మోనికా సాంగ్ అందరినీ అలరిస్తోంది.

సముద్రం నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ పాటలో పూజా హెగ్డే రెడ్ కలర్ డ్రెస్‌లో, ప్రతి ఫ్రేమ్‌ను తన అద్భుతమైన డ్యాన్స్‌తో కట్టిపడేసింది. ఆమెతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కనిపించడం ట్రాక్‌కు ఫన్ ఎనర్జీ తీసుకువచ్చింది. అనిరుధ్, శుభలక్ష్మి కలసి హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్‌లో అసల్ కోలార్ ర్యాప్ అదరగొడుతోంది. ఆగస్టు 14న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News