మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో తన జోరు చూపిస్తున్నాడు. తెలుగులో దుల్కర్ చేసిన ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మరో తెలుగు మూవీ చేస్తున్నాడు. DQ41 రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ కు జోడీగా అందాల తార పూజాహెగ్డే నటిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం మేకర్స్ వీడియోను వదిలారు. ఇందులో దుల్కర్-పూజా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది.
ఇక, పూజా కూడా తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత మరో సినిమా చేయలేదు. ఈ మూవీతో సక్సెస్ సాధించి మరిన్ని ప్రాజెక్టులను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా, DQ41 సినిమాను కొత్త డైరెక్టర్ రవి నేలకుడితి తెరకెక్కిస్తున్నాడు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
Also Read: మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తండ్రైన హీరో వరుణ్ తేజ్