మరమ్మత్తుల కారణంగా..
నేడు ఉప్పల్ పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత
మన తెలంగాణ/ఉప్పల్: విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం ఉప్పల్ పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు బగాయత్ అసిస్టెంట్ ఇంజనీర్ బి. కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శిల్పారామం ఫీడర్ పరిధిలో నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. 11 కెవి శాంతినగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు బాలాజీ నర్సింగ్ హోమ్, విజయపురి కాలనీ, ర్యాంకర్ స్కూల్ లైన్, విజయపురి కాలనీ ఫీడర్ పరిధిలో సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు విజయపురి కాలనీ, ఉప్పల్ బగాయత్, సాయిబాబా కాలనీ పరిసర ప్రాంతాలలో సరఫరాను నిలిపివేస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఉప్పల్ సెక్షన్ పరిధిలో..
ఉప్పల్ కళ్యాణపురి ఫీడర్ పరిధిలో విద్యుత్ వైర్లపై వాలిని చెట్ల కొమ్మలను తొలగించేందుకు మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం 4-30 గంటల వరకు జహీద్ నగర్, బ్యాంకు కాలనీ, ఇందిరా నగర్, అంబేద్కర్ నగర్, సీతారామ కాలనీ, ఈస్ట్, నార్త్ కళ్యాణపురి, బాలాజీ ఎంక్లేవ్, టీచర్స్ కాలనీ, అజమత్ నగర్, విశిష్ట ఎంక్లేవ్ పరిసర ప్రాంతాలలో సరఫరాను నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఇంజనీర్ ఎం. నిఖిల్ తెలిపారు.
చిల్కానగర్ సెక్షన్ పరిధిలో
చిల్కానగర్ సెక్షన్ బాలాజీ హిల్స్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుండి 11 గంటలవరకు నార్త్ బాలాజీ హిల్స్, రాజశేఖర్ కాలనీ, బాలాజీ హిల్స్, సూర్య హిల్స్, నవోదయ కాలనీ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఇంజనీర్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యహిల్స్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈదయ్య నగర్, న్యూ హేమా నగర్, కుమ్మరి కుంట పద్మావతి కాలనీ, వెస్ట్ బాలాజీ హిల్స్ న్యూ రాంనగర్, మెక్ డోవెల్ కాలనీ పరిసర ప్రాంతాలలో సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ అసౌకర్యానికి వినియోగదారులు సంస్థకు సహకరించాలని కోరారు.