Thursday, September 18, 2025

పొలిటికల్ సినిమాల్లో విభిన్నమైన చిత్రం

- Advertisement -
- Advertisement -

హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ’భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ’భద్రకాళి’ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-భద్రకాళి పొలిటికల్ థ్రిల్లర్. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో సినిమా ఉంటుంది.

నేను పొలిటికల్ మీడియేటర్‌గా కనిపిస్తాను. రాజకీయాల్లో ఒక మీడియేటర్ పాత్ర ఎలా ఉంటుంది? ఒక పెద్ద స్కాం లో తన పాత్ర ఏమిటి? అనేది ఆడియన్స్‌కి కొత్త అనుభూతినిస్తుంది. డైరెక్టర్ అరుణ్ ప్రభు అద్భుతమైన కథ తీసుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో నా 25వ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ మూవీ. -పొలిటికల్ సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇలాంటి పొలిటికల్ బ్రోకర్ క్యారెక్టర్ ఇప్పటివరకు రాలేదు. సినిమాలో మేకప్ లేకుండా నటించడం జరిగింది. ఈ చిత్రంలో తృప్తి రవీంద్ర భార్య పాత్రలో కనిపిస్తారు. రియా పోలీస్ క్యారెక్టర్ చేసింది. నన్ను పట్టుకోవాలనుకునే క్యారెక్టర్ అది. -ఇక ప్రస్తుతం బిచ్చగాడు డైరెక్టర్‌తో వంద దేవుళ్ళు సినిమా చేస్తున్నాను. బిగ్ స్కేల్ మూవీ అది. తెలుగు, తమిళ్‌లో రెండు భాషల్లో ఒకేసారి ఆ సినిమా రిలీజ్ అవుతుంది”అని తెలిపారు.

Also Read : హలీవుడ్ స్థాయికి హైదరాబాద్‌

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News