Tuesday, September 16, 2025

రేపు ముంబైలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Prabhas promotions for Radhe Shyam

ముంబై: ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మేకర్స్ కొత్త ట్రైలర్‌ను మార్చి 2 మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. యూరప్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న చిత్రాలలో ఒకటి. 60 సెకన్ల రాధేశ్యామ్ ట్రైలర్ సిద్ధం చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. రేపు ఆవిష్కృతం కానున్న వన్ మినిట్ ట్రైలర్ రాధే శ్యామ్ పై అంచనాలను మరింత పెంచేసింది. ముంబయిలో మీడియా సమక్షంలో ప్రభాస్ చేతుల మీదగా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ప్రభాస్ ముంబై నుంచి రాధేశ్యామ్ ప్రచారం మొదలుపెట్టనున్నారు. మార్చి 10 వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రానుంది. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News