Saturday, June 14, 2025

నెటిజన్లకు ‘రాజాసాబ్’ టీమ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాజాసాబ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుంచే ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే ఇప్పటికే కొన్ని లీక్ అయిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించే ఈ సినిమా, మారుతి కథలోని కామెడీ,

యాక్షన్ మిక్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈనెల 16న విడుదల కానున్న ‘రాజాసాబ్’ టీజర్‌లోని కొన్ని విజువల్స్ లీక్ కావడం ఒక్కసారిగా మేకర్స్‌ను షాక్‌కు గురి చేసింది. దీంతో ‘లీకైన కంటెంట్‌ను షేర్ చేసే అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిని షేర్ చేయకుండా మాకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాం’ అని సోషల్ మీడియాలో వార్నింగ్ నోట్ జారీ చేశారు. ఇక ఈ లీక్‌ను అడ్డుకోవడానికి మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ లీక్ సంఘటనతో ‘రాజాసాబ్’ టీజర్‌పై అభిమానుల్లో కాస్త నిరాశ కలిగినా, మేకర్స్ అధికారికంగా టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో టీజర్‌ను విడుదల చేస్తారట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News