ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలెగావ్ పే లుళ్ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బిజెపి మాజీ ఎంపి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టెనెంట్ కల్నల్ ప్రసాద్ పు రోహిత్ సహా మొత్త ఏడుగురు నిందితులనునిర్దోషులుగా ప్రకటిస్తూ ముం బయి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువా రం తీర్పు ఇచ్చింది. ందితులకు వ్యతిరేకంగా ఎలాంటి నమ్మదగ్గ, బలమైన సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు వారి ని నిర్దోషులుగా ప్రకటించింది. ఉ గ్ర వాదానికి మతం లేదని, ఏ మతం కూ డా హింసను ప్రోత్సహించదని కోర్టు అంటూ, కేవలం ఊహాగానాలు, నైతి క ఆధారాల ఆధారంగా శిక్షించలేమ ని కోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ‘ఈ కేసుకు ఉపా(చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక)చట్టం వర్తించదు. ఈ పేలుడుకు ఉపయోగించిన మో టార్ బైక్ ప్ర జ్ఞా ఠాకూర్ పేరుమీద రి జిస్టర్ అయిందని ప్రాసిక్యూషన్ చేసి న వాదనకు తగిన సాక్షాధారాలు లే వు. బైక్‌కు అమర్చిన బాంబు వల్లే పే లుడు జరిగిందని చెప్పేందుకు కూ డా ఆధారాలు లేవు.
కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరినీ కోర్టులు శిక్షించవు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలు లేవు’ తీర్పు ప్రకటించిన సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించాలని కూడా పేర్కొంది. కాగా తీర్పుపై మాజీ ఎంపి ప్రజ్ఞా ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు కారణంగాగత 17 ఏళ్ల పాటు తన జీవితం నాశనం అయిందని, తనను బాధపెట్టిన వారిని భగవంతుడే శిక్షిస్తారని అన్నారు. మరోవైపు తీర్పు పట్ట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేస్తూ,‘ ఉగ్రవాదం ఎప్పటికీ కాషాయం కాదని, భవిష్యత్తులో కూడా కాబోదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ తీర్పును తాము హైకోర్టులో సవాలు చేయనున్నట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి.
కేసు పూర్వాపరాలు
మహారాష్ట్రలోని మాలెగావ్ పట్టణంలో 2008 సెప్టెంబర్ 29న ఓ మసీదు వద్ద మోటారు సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు వ్యక్తులు చనిపోగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్‌తో పాటు రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీకార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది , సమీర్ కులకర్ణి ప్రధాన నిందితులుగా కేసు నమోదు అయింది. ఈ కేసులో తొలుత విచారణ ప్రారంభించిన ఎటిఎస్ ప్రస్తుతం 40వ నంబర్ సాక్షి సహా కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఆ తర్వాత ఎన్‌ఐఎ కేసు దర్యాప్తును చేపట్టింది.ఈ కేసులో మొత్తం 223మంది సాక్షులను విచారించగా, అందులో 37 మంది అంతకు ముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడడం గమనార్హం.