Monday, September 15, 2025

ఈనెల 17న ప్రజా పాలన దినోత్సవం

- Advertisement -
- Advertisement -

ఈనెల 17వ తేదీని ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జీ మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. సిఎం రేవంత్ రెడ్డి సైతం 17వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జెండా ఆవిష్కరించనుండగా మంత్రులు వివేక్ మెదక్ జిల్లాలో, కొండా సురేఖ, వరంగల్‌లో, అడ్లూరి లక్ష్మణ్, కరీంనగర్‌లో, భద్రాద్రి కొత్తగూడెం తుమ్మల నాగేశ్వరరావు, మహబూబ్‌నగర్ జూపల్లి కృష్ణారావు, ములుగు సీతక్క, రంగారెడ్డిలో శ్రీధర్‌బాబు, సంగారెడ్డిలో దామోదర రాజనర్సింహా తదితరులు జెండా ఎగురేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తోంది.

Also REad: అంధకారంలో 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు : కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News