Saturday, May 24, 2025

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటి సత్వర పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు చిత్తశుద్దితో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి తోడ్పాడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల నుంచి 110 మంది దరఖాస్తులు అందించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి, డిఆర్డిఏ పీడీ సన్యాసయ్య, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News