Tuesday, July 8, 2025

ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కమీషనర్ కర్ణన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ సిటీ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కమీషనర్‌కు తమ విన్నపాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను కమీషనర్ క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమీషనర్ కర్ణన్ మాట్లాడుతూ… ప్రజల విన్నపాల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రతి అర్జీదారు సమస్య పరిష్కారం కోసం తిరిగి అదే సమస్య విన్నవించకుండా హెచ్‌ఓడి లు కృషి చేయాలన్నారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించినప్రజావాణి కార్యక్రమంలో74 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 37, ట్యాక్స్ సెక్షన్, హౌసింగ్ విభాగాలకు 7 చొప్పున, విజిలెన్స్ విభాగానికి 5, ఇంజనీరింగ్ విభాగానికి 4, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగానికి 3, ఫైనాన్స్ 2, లీగల్, ఎల్.డబ్ల్యూ.ఎస్, అడ్మిన్, యు.బి.డి, యు.సి.డి విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందగా,ఫోన్ ఇన్ ద్వారా 4 ఫిర్యాదు అందాయి.

జిహెచ్‌ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 126 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్‌లో 55, శేరిలింగంపల్లి జోన్ లో 28, సికింద్రాబాద్ జోన్ లో 27, ఎల్బీనగర్ జోన్ లో 9, చార్మినార్ జోన్ లో 6, ఖైరతాబాద్ జోన్ లో ఒక ఫిర్యాదు అందింది. ఈకార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ లు రఘు ప్రసాద్, వేణుగోపాల్, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, గీత రాధిక, మంగతాయారు, సిసీపీ శ్రీనివాస్, సి ఈ సహదేవ్ రత్నాకర్, హౌసింగ్ సి ఈ నిత్యానంద, అడిషనల్ సిసిపి గంగాధర్, బి వెంకన్న, ప్రదీప్, రంజిత్, అసిస్టెంట్ అడ్వర్టైజ్మెంట్ అధికారి దుర్ధన భాను, అసిస్టెంట్ ఎస్టేట్ మేనేజర్ ఉమ ప్రకాశ్, యు బి డి డైరెక్టర్ వెంకటేశ్వర రావు, విద్యుత్ ఈ ఈ మమత, యుసిడి పిడి దేవేందర్ రెడ్డి, ఈ ఈ లేక్స్ నారాయణ, డిప్యూటీ సి ఈ పనస రెడ్డి, హౌసింగ్ ఈ ఈ లు పి.వి రమణ, రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News