Thursday, September 18, 2025

‘ఒజి’ నుంచి మరో అప్‌డేట్.. కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది. ఒక్కొక్కటి సినిమా నుంచి అప్‌డేట్లు వస్తున్నాయి. చతాజా చిత్ యూనిట్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో నటుడు ప్రకాశ్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ‘సత్య దాదా’ అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రకాశ్ రాజ్ చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.

ఇక సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఒజి’ (OG Movie) రూపొందింది. పవన్ గతంలో ఎప్పుడు కనిపించని విధంగా గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటస్తున్నారు. శ్రియారెడ్డి, అర్జున్ దాస్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Also Read : ‘మిరాయ్’ సక్సెస్ మా టీమ్‌లో ప్రతి ఒక్కరిదీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News