- Advertisement -
హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం ఇడి ముందు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు ఆయనకు ఇడి అధికారులు పది రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. ప్రకాశ్ రాజుతో పాటు విజయ్ దేవరకొండ,దగ్గుబాటి రానా, మంచు లక్ష్మీలకు ఇడి నోటీసులు ఇచ్చింది. దగ్గుబాటి రానా ఈ నెల 23న, ప్రకాశ్ రాజ్ ఈ నెల30, విజయ్‌దేవరకొండ ఆగస్టు 6, మంచు లక్ష్మీ ఆగస్టు 13 తేదీల్లో విచారణకు హాజరుకానున్నారు. పలువురు సెలబెట్రీలకు ఇడి నోటీసులు జారీ చేసి విచారణ చేయనున్నారు.
- Advertisement -