Sunday, July 6, 2025

కొమరోలులో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో జరిగింది. నల్లగుంట్ల గ్రామ శివారులో ఓ ప్రేమ జంట ఉరేసుకొని కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం వాసులుగా గుర్తించినట్టు సమాచారం. పెద్దలు వీరి ప్రేమకు అడ్డుచెప్పడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News