Tuesday, July 1, 2025

అలా.. టిడిపిని లాక్కున్న దుర్మార్గుడు బాబు : నల్లపరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కు వస్తున్న ఆదరణ చూసి ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుందని వైసిపి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) తెలిపారు. చంద్రబాబుపై నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత మామపై చెప్పులు వేయించిన వ్యక్తి చంద్రబాబు అని వెన్నుపోటు పొడిచి టిడిపిని లాక్కున్న దుర్మార్గుడు అని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలను ఎవరైనా అడ్డుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా సింహం రావడం పక్కా అని అన్నారు. సింహపురి సింహాల (Lions Simhapuri) ముందు చంద్రబాబు కుట్రలు సాగవు అని ఎపి ప్రభుత్వం ఆంక్షలే బాబు పతనానికి సంకేతాలు కాబోతున్నాయని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News