- Advertisement -
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమిత్రనగర్‌లో గల అంకుర్ హాస్పిటల్‌లో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. నవ్వుతూ డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన సింధుజ (32) అనే గర్భిణి, చికిత్సలో భాగంగా ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన అరగంటలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మృతురాలి భర్త తిరుపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉదయం డెలివరీ కోసం సింధుజను ఆసుపత్రిలో చేర్పించామని, చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ, మరోసారి బిపి హెచ్చైంది అంటూ వైద్యులు వివరణ ఇచ్చారని తెలిపారు. ఇందుకు కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేధన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ వారు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.
- Advertisement -