- Advertisement -
పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం అని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణలకు దిశానిర్ధేశం చేశారు. శనివారం ఎర్రవెల్లిలోని నివాసంలో కెసిఆర్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు బిఆర్‌ఎస్ శ్రేణులు గట్టిగా కృషి చేయాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఎపి సిఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సిఎం రేవంత్ మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని కెసిఆర్ పేర్కొన్నారు.
- Advertisement -